News April 1, 2026
అశ్వారావుపేట: ఆయిల్‌పామ్ గెల టన్ను @23,005

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ పామాయిల్ (CPO) ధరలు పెరగడంతో ఆయిల్‌పామ్ రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. మార్చి నెలకు గాను టన్ను గెలల ధరపై రూ.1,459 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టన్ను ధర రూ.23,005.33కు చేరింది. ప్రభుత్వ కొత్త ధరల సూత్రం రైతులకు ఆశాజనకంగా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే మెరుగైన ధర లభించడంతో సాగుపై రైతులు మరింత ఉత్సాహం చూపుతున్నారు.
Similar News
News April 14, 2026
సాగర్: టన్నెల్ డీప్ కట్‌లో రాళ్లు తొలగింపు జరిగేనా?

సాగర్ ఎడమ కాల్వలోని పొట్టి చెలిమ టన్నెల్ డీప్ కట్ ప్రాంతంలో ఏటా విరిగిపడుతున్న భారీ రాళ్లు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. 2018లో ఆధునికీకరణ పనులు జరిగినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. రాళ్ల వల్ల నీటి వేగం తగ్గి దిగువ ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత వేసవిలోనైనా అధికారులు స్పందించి, ఆ రాళ్లను తొలగించి శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని సాగర్ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
News April 14, 2026
సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: పొన్నం

TG: RTC ఉద్యోగులు <<19641755>>సమ్మె నిర్ణయాన్ని<<>> వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
News April 14, 2026
దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అనన్యం: కలెక్టర్

నరసరావుపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ కృతిక శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలు అనన్యం అని ఆమె కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొని అంజలి ఘటించారు.


