News February 14, 2026

అశ్వారావుపేట: ఒకే కుటుంబం.. ముగ్గురు కౌన్సిలర్లు

image

అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల్లో ‘నార్లపాటి’ కుటుంబం అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే ఇంటి పేరు గల ముగ్గురు సమీప బంధువులు కౌన్సిలర్లుగా గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచారు. 11వ వార్డు నుంచి నార్లపాటి మహేష్, 21 – నార్లపాటి మౌనిక, 22 – నార్లపాటి దివాకర్ విజయం సాధించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పురపాలనలో అడుగుపెట్టడం ఇప్పుడు స్థానికంగా విశేషంగా నిలిచింది.

Similar News

News February 22, 2026

విజయవాడలో పోటీపడనున్న జనసేన మంత్రి టీం Vs TDP మంత్రి టీం

image

ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి MLA, MLCల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లకు మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ సారధులుగా ఉండనున్నారు. క్రీడలు ఆడే వారి సంఖ్య పెరిగితే మరొక జట్టు పెరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జట్లలోని సభ్యులు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.

News February 22, 2026

NTR: చెన్నై వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), H. నిజాముద్దీన్ (NZM) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నంబరు 06019 MAS- NZM రైలును సోమవారం నుంచి మార్చి 9 వరకు ప్రతి సోమవారం, నంబరు 06020 NZM- MAS రైలును ఫిబ్రవరి 26 నుంచి మార్చి 12 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలిలో ఆగుతాయన్నారు.

News February 22, 2026

పరీక్షల వేళ డీజేలకు నో ఎంట్రీ.. ఎస్పీ హెచ్చరిక

image

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఆటంకం కలగకుండా ధ్వని కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్సులు, స్టేజ్ ప్రోగ్రాములు నిర్వహించరాదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.