News March 14, 2025

అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం

image

అశ్వారావుపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుమలకుంట గ్రామ శివారు ఆంజనేయస్వామి గుడి దగ్గర రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

48 మంది ఎమ్మెల్యేలపై CBN సీరియస్

image

AP: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలో పాల్గొనడం లేదని మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని పార్టీ కేంద్ర కార్యాలయం సభ్యులతో సమావేశం సందర్భంగా ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, MLAలు పాల్గొనాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే నచ్చిన కార్యకర్తలనే కాకుండా పార్టీ కోసం కష్టపడేవారిని గుర్తించాలన్నారు.

News November 8, 2025

వివేకా హత్య కేసు.. ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు

image

AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం పీఎస్ ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News November 8, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్‌కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్‌ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్‌లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.