News April 7, 2025
అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

అశ్వారావుపేట శివారులో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన జీసీసీ రేషన్ డీలర్ భూక్యా కృష్ణ మండలం కావడిగుండ్లలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో దొంతికుంట సమీపంలో వాగొడ్డుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో డీలర్ కృష్ణకు కుడికాలు విరగ్గా వాగొడ్డుగూడెంకు చెందిన నాగరాజు, గంగారంకి చెందిన రాజుకు గాయాలయ్యాయి.
Similar News
News April 10, 2025
90 రోజుల పాటు టారిఫ్స్ నిలిపివేత.. చైనాపై మాత్రం 125%కి పెంపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా తప్ప మిగతా 70 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో చైనాపై టారిఫ్‌ను 125%కి పెంచుతున్నట్లు తెలిపారు. చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా, అమెరికా వస్తువులపై చైనా 84% టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.
News April 10, 2025
మీ ఇంట్లో ఏసీ, కూలర్ లేదా? ఇలా చేయండి!

సమ్మర్‌లో ఇల్లంతా వేడిగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంటిని కూల్‌గా ఉంచుకోవచ్చు. ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వంట ఉదయం, సాయంత్రం చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువగా వాడాలి. టబ్‌లో నీళ్లు పోసి, ఐస్ ముక్కలు వేసి, ఇంటి మధ్యలో పెడితే చల్లగా ఉంటుంది. ఇంటి చుట్టూ మొక్కలు, టెర్రస్‌పై కూల్ పెయింట్ వేసుకోవాలి. కిటికీలకు గడ్డితో చేసిన పరదాలు కడితే కూలర్లకంటే చల్లదనం వస్తుంది.
News April 10, 2025
పెద్దపల్లి: కూతురిని చంపి.. తల్లి ఆత్మహత్య!

పెద్దపల్లిలోని టీచర్స్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.మూడేళ్ల కుమార్తె వితన్యరెడ్డిని చంపి తల్లి సాహితీ ఆత్మహత్య చేసుకుంది. మొదట కూతురిని చంపి తర్వాత తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతురాలి భర్త ఇంట్లోలేని సమయంలో సాహితీ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.