News December 15, 2025

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్ భేటీ

image

AP: విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. స్కిల్ అసెస్మెంటులో AI టెక్నాలజీ ఆధారిత పోర్టల్, పైలెట్ ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. రాష్ట్ర నైపుణ్య గణనకు సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో InnoXR యానిమేషన్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితోనూ లోకేశ్ సమావేశమయ్యారు.

Similar News

News March 6, 2026

ఎల్లుండి ఫైనల్.. అభిషేక్ శర్మ వైపే మొగ్గు!

image

T20WCలో వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మను పక్కన పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అయితే అతడికి ఫైనల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని టీమ్ యాజమాన్యం యోచిస్తున్నట్లు PTI తెలిపింది. అభిషేక్ దూకుడును సపోర్ట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని పేర్కొంది. టీమ్‌లో మార్పులు చేస్తే కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని, అందుకే ఫైనల్లో మార్పులు ఉండకపోవచ్చని పేర్కొంది.

News March 6, 2026

రూ.9.8 లక్షల కోట్ల ఆస్తితో ముకేశ్ నంబర్-1

image

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026లో IND నుంచి ముకేశ్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్) ₹9.8 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో గౌతమ్ అదానీ(₹7.5L Cr), రోష్నీ నాడార్ మల్హోత్రా-HCL(₹3.2L Cr), పూనావాలా-సీరమ్ ఇన్‌స్టిట్యూట్(₹3L Cr), కుమార మంగళం బిర్లా-ఆదిత్య బిర్లా(₹2.5L Cr), దిలీప్ సంఘ్వీ-సన్ ఫార్మా(₹2.3L Cr), అజీమ్ ప్రేమ్‌జీ-విప్రో(₹2.3L Cr), నీరజ్-బజాజ్ ఆటో(₹2.2L Cr) ఉన్నారు.

News March 6, 2026

ఇరాన్‌పై దాడి.. మోదీకి ముందే చెప్పారా?

image

ఇరాన్‌పై దాడులకు కొన్ని రోజుల ముందే పీఎం మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు దాడి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అయితే దాంట్లో నిజం లేదని భారత్‌లోని ఆ దేశ అంబాసిడర్ అజార్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడి టైమింగ్ నిర్ణయించామని తెలిపారు. అందుకే మోదీకి ఈ విషయం ముందే తెలిసే ఆస్కారమే లేదని వివరించారు.