News February 5, 2025

అసంఘటిత కార్మికుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ – కలెక్టర్

image

అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్ నందు ఉచిత నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్క కార్మికుడిని పోర్టల్‌లో నమోదు చేయించాలని సూచించారు.

Similar News

News December 26, 2025

పింఛన్ లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్!

image

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.

News December 26, 2025

రాజమండ్రి: రేపటి నుంచి గ్రాండ్ కార్నివాల్

image

రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో గ్రాండ్ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. సుబ్రహ్మణ్యం మైదానంలో “ఫుడ్-మ్యూజిక్-ఫన్” థీమ్‌తో ఈ వేడుకలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో జరిగే ఈ కార్నివాల్‌లో మ్యూజికల్ ఈవెంట్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్, సెల్ఫీ బూత్‌లు ఏర్పాటు చేశారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ వేడుకలను ఆస్వాదించాలని ఆయన కోరారు.

News December 26, 2025

రాజమండ్రి: కాంగ్రెస్‌ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు- పురందేశ్వరి

image

‘ఓట్ చోరీ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని MP పురందేశ్వరి విమర్శించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కీలక అంశాలపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ అనైతిక చర్యలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.