News December 31, 2024

అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: నిర్మల్ SP

image

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున భైంసాలోని నాగదేవత ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించే క్రమంలో సమీపంలోని టైల్స్ పగిలిపోయాయన్నారు. ఇంతకుమించి ఆలయంలో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానిని నమ్మవద్దని SP విజ్ఞప్తి చేశారు.

Similar News

News November 9, 2025

పెరుగనున్న చలి తీవ్రత.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

నవంబర్ 11 నుంచి 19 వరకు తీవ్ర చలి పరిస్థితులు నెలకొనున్నందున ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ADB కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. తెలంగాణ వేదర్‌మన్ విడుదల చేసిన మ్యాప్ ప్రకారం జిల్లాలో 9–12 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు

News November 9, 2025

ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.

News November 9, 2025

మొక్కజొన్న, సోయాబీన్‌కు మద్దతు ధరతో కొనుగోలు: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా రైతుల కోసం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, సందేహాల కోసం రైతులు 6300001597ను సంప్రదించాలన్నారు.