News October 21, 2024

అసలైన క్రిమినల్సే దేశాన్ని పాలిస్తున్నారు: CPI నేత కూనంనేని

image

దేశంలో ప్రజల కోసం, ప్రజల హక్కుల పనిచేస్తున్నవారు జైళ్లలో మగ్గుతున్నారని, జైళ్లలో ఉండాల్సిన క్రిమినల్స్ దేశాన్ని పాలిస్తున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. SVKలో జరిగిన ప్రొ.సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతూ.. ఏ నేరం చేయకుండానే పౌర హక్కుల కోసం పనిచేస్తున్న సాయిబాబాను 10 ఏళ్లు జైలులో ఉంచి నిర్దోషిగా తేల్చారని మండిపడ్డారు. జైలులో ఉంచిన వారిని ఏం చేయాలని, ఎలా శిక్షించాలని ప్రశ్నించారు.

Similar News

News September 18, 2025

BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

image

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: బ‌తుక‌మ్మ‌, దసరా కోసం ప్రత్యేక బస్సులు

image

బ‌తుక‌మ్మ‌, దసరాకు ప్రయాణికుల కోసం TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది.

News September 18, 2025

HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

image

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.