News February 12, 2026

అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి రిప్లై

image

★ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రశ్నలు:
☞ పుట్టపర్తిలో IIIT ఏర్పాటు చేయాలి
☞ ఒంగోలు ఐఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియర్ సైన్స్ కోర్స్‌లు ప్రవేశపెట్టాలి
☞ అసంపూర్తిగా ఉన్న బుక్కపట్నం డిగ్రీ కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్
★ మంత్రి నారా లోకేశ్ రిప్లై:
☞ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే డిమాండ్లను పరిష్కరిస్తాం.

Similar News

News February 13, 2026

SAIలో 323 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<>SAI<<>>)లో 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిప్లొమా, ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఏషియన్ గేమ్స్/ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్నవారు, స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అర్హులు. రాత పరీక్ష, కోచింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in

News February 13, 2026

నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ విజయం..!

image

నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయగర్జన చేసింది. 1వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి సంగీత రమేష్ నాయక్ ఘనవిజయం సాధించారు. మొత్తం 16 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో వెలువడిన తొలి ఫలితం ఇదే. మొదటిసారి మున్సిపాలిటీగా ఏర్పడిన మద్దూరులో గెలవడం పట్ల సంగీత హర్షం వ్యక్తం చేస్తూ, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

శివ పూజలో పసుపు, కుంకుమ వాడుతున్నారా?

image

శివలింగానికి పసుపు, కుంకుమలు వాడరు. శివుడు వైరాగ్యానికి ప్రతీక. ఆయనకు విభూతి అంటే ప్రీతిపాత్రం. పసుపు, కుంకుమలు సౌభాగ్యానికి, ప్రాపంచిక సుఖాలకు చిహ్నాలుగా భావిస్తారు. అందుకే వాటిని లింగాభిషేకంలో వాడరు. అయితే శివలింగం కింద ఉండే పానువట్టం శక్తి స్వరూపం. అక్కడ పసుపు కుంకుమలు అలంకరించవచ్చు. అలాగే శివ కళ్యాణం వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ వాడుతుంటారు. నిత్య పూజలో మాత్రం విభూతి, బిల్వపత్రాలకే ప్రాధాన్యం.