News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.

Similar News

News February 16, 2026

పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

image

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News February 16, 2026

పాపన్నపేట: కట్టుదిట్టమైన పార్కింగ్.. ఇబ్బందులకు చెక్!

image

ఏడుపాయల వనజాతరకు వచ్చే భక్తుల కోసం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టేకులగడ్డ, చెలిమెకుంట వద్ద భారీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. బారికేడ్ల సాయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. సోమవారం జరిగిన బండ్ల ఊరేగింపు, మంగళవారం జరగనున్న రథోత్సవానికి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 16, 2026

మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.