News February 24, 2025

అసెంబ్లీలో YCPని ప్రతిపక్షంగా గుర్తించాలి: పెద్దిరెడ్డి 

image

అసెంబ్లీలో వైసీపీని ప్రభుత్వం ప్రతిపక్షంగా గుర్తించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటిని ఎక్కడా నిరూపించలేదన్నారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. 

Similar News

News February 10, 2026

చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

image

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

News February 10, 2026

చిత్తూరు జిల్లాలో విషాదం

image

నెల్లిపట్ల గ్రామ పంచాయతీ కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన యానాది గజేంద్ర (31) ప్రమాదవశాత్తు బావిలోకి దిగి మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మున్నెప్ప వ్యవసాయ బావిలోకి మోటర్ మరమ్మతుకై దిగుతుండగా గజేంద్ర కాలుజారి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 10, 2026

ఎల్లుండి నుంచి మొగిలిలో బ్రహ్మోత్సవాలు

image

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని స్వయంభు మొగిలేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో మునిరాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పారు.