News July 25, 2024
అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ గా బద్వేలు MLA

బద్వేలు MLAగా రెండో సారి ఎన్నికైన డాక్టర్ దాసరి సుధను ప్యానెల్ స్పీకర్‌గా నియమించడం జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈమెతో పాటు వరద రాజులరెడ్డిని కూడా నియమించారు. 2024 ఎన్నికల్లో BJP అభ్యర్థిపై 20వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. అంతకుముందు భర్త మరణించడంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సుధ ఉపఎన్నికల్లో 90 వేలు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. అటు BJP విప్‌గా ఆదినారాయణరెడ్డిని ఎంపిక చేశారు.
Similar News
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


