News March 15, 2025
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్‌లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
News March 15, 2025
గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.
News March 15, 2025
నిజామాబాద్: ఇంటర్ పరీక్షల్లో 364 మంది విద్యార్థులు గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.