News November 12, 2024
అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్

రాష్ట్ర అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన అశోక్‌ను విప్‌గా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా అశోక్‌కు ఈ పదవి వరించింది.
Similar News
News February 28, 2026
శ్రీకాకుళం: ఆ మారణహోమం జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తి

సంతబొమ్మాళి(M) కాకరపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటయోధులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈస్ట్ కోస్ట్ సంస్థ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ 2011 ఫిబ్రవరి 28వ తేదీన స్థానికులు ఆందోళన చేపట్టారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ఆందోళనకారులు మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పర్యావరణ శాఖ ఈ ప్లాంట్ నిర్మాణాన్ని రద్దు చేసింది.
News February 28, 2026
శ్రీకాకుళం: ‘ఏపీ గురుకులాల్లో ప్రవేశాలు’

ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని DEO రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ పోస్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనిట్‌గా 5, 6, 7, 8వ తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 18 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కాగా, మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 28, 2026
అతిసారం అదుపులోనే ఉంది: శ్రీకాకుళం కలెక్టర్

అతిసారం పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 162 కేసులు నమోదు కాగా 47మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 112 మంది చికిత్స పొందుతున్నారు.


