News November 12, 2024
అసెంబ్లీ విప్‌లుగా బోండా ఉమ, యార్లగడ్డ, తంగిరాల సౌమ్య
శాసన సభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను కాసేపటి క్రితం ప్రభుత్వం ఖరారు చేసింది. ఇద్దరు చీఫ్ విప్‌లతో పాటు 15 మందిని విప్‌లుగా నియమించింది. శాసన సభ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలి చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమ(విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య(నందిగామ), యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం) అసెంబ్లీ విప్‌లుగా అవకాశం లభించింది.
Similar News
News November 14, 2024
బాలలే దేశ భవిష్యత్.. గవర్నర్ అబ్దుల్ నజీర్
బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు.
News November 14, 2024
అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆగ్రహం
ఉపాధి హామీ, జల్‌జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులకు నిధుల కొరత లేకున్నా పనులు గ్రౌండింగ్‌లో ఉండటంతో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమై పలు పనుల పురోగతిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 13, 2024
గన్నవరంలో బాలికపై అత్యాచారం
గన్నవరంలో ఓ బాలికపై కొన్నాళ్లుగా అదే ఊరికి చెందిన ప్రశాంత్ అలియాస్ బన్ను అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలికకు కడుపునొప్పి రాగా తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లడంలో గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.