News March 5, 2026

అహోబిలంలో తెప్పోత్సవాలు ప్రారంభం

image

దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. 46వ పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో, కావు రామానుజన్ అధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకు వచ్చారు. తెప్పలో ఉంచి ఐదు చుట్టులు విహరింపజేశారు.

Similar News

News March 9, 2026

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రవీందర్, ఏసీపీలు, డీఈలు, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

News March 9, 2026

చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

image

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 9, 2026

ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

image

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.