News October 17, 2025
ఆందోల్: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఆందోల్ మండలం చింతకుంట గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి ఇంటర్ విద్యార్థి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాళ్లపాడు గ్రామానికి చెందిన రాములు కుమారుడు జగన్ (17) ఇస్నాపూర్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్నాడు. జగన్ కళాశాలకు రావడంలేదని ప్రిన్సిపల్ ఫోన్ చేసి జగన్ తండ్రికి చెప్పడంతో మందలించాడు. మనస్థాపానికి గురైన జగన్ బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News October 17, 2025
భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 17, 2025
WGL: భారీగా పడిపోయిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు శుక్రవారం రైతన్నలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. రెండు నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర భారీగా పడిపోయింది. నేడు క్వింటా పత్తి ధర రూ.6,860 పలికింది. మంగళవారం రూ.6,960, బుధవారం రూ.6,940, గురువారం రూ. 6,930 ధరలు పలికాయి. ధరలు పడిపోవడం అన్నదాతలను నిరాశకు గురి చేస్తున్నాయి.
News October 17, 2025
భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.