News December 27, 2025
ఆందోల్: నీటిలో మునిగి బాలుడు మృతి

ఆందోల్ మండలం మాన్సాన్‌పల్లికి చెందిన ప్రసాద్(16) నీట మునిగి చనిపోయాడు. స్నేహితులతో కలిసి ఘనపూర్ ప్రాజెక్టు రెండో బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నీటిలో మునిగిపోతున్న ఓ స్నేహితుడిని రక్షించే క్రమంలో ప్రసాద్ లోతులోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారుడు ఒకరిని రక్షించగలిగినప్పటికీ, ప్రసాద్ చనిపోయాడు. పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
Similar News
News December 28, 2025
హనుమకొండ: ఇంటింటా కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటా కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య తెలిపారు. శనివారం వేలేరు మండలంలోని 4 ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటికీ 11 వేల మందికి కుష్టు నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చెప్పారు. జనవరి మొదటి వారంలోగా కుష్టు నిర్ధారణ సర్వే పూర్తి చేసి, వ్యాధిగ్రస్తులకు పూర్తి స్థాయి వైద్య చికిత్స అందిస్తామన్నారు.
News December 28, 2025
‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.
News December 28, 2025
పెండింగ్ ప్రాపర్టీ కేసులు వేగంగా పరిష్కరించాలి: SP

దీర్ఘకాలికంగా దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని నేరాల స్థితిగతులు, శాంతి భద్రతలు, విజిబుల్ పోలిసింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఏఎస్పీ రమణ ఉన్నారు.


