News February 10, 2025
ఆందోల్: మంజీరా నదిలో దూకి వ్యక్తి మృతి

చిలిపిచేడ్ మండలం చిట్కుల్ మంజీరా నదిలో దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు. చండూరు గ్రామానికి చెందిన రమేష్ సోమవారం ఉదయం మంజీరా నదిలో దూకగా విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 20, 2026
ఉచిత పథకాలు ఉండాలా.. మీరేమంటారు?

ఉచిత పథకాల వల్ల ఆర్థికాభివృద్ధికి <<19183229>>ఆటంకం<<>> కలుగుతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. SC వ్యాఖ్యలతో పలువురు ఏకీభవిస్తున్నారు. విద్య, వైద్యం వంటివి ఫ్రీగా అందేలా చూడాలని, బస్సుల్లో ఫ్రీ, కరెంటు ఫ్రీ, నగదు బదిలీతో నష్టమని అంటున్నారు. ఉపాధి కల్పించాలని, రైతులకు విత్తనాలు, ఎరువులు, మందులు తక్కువ ధరకు ఇవ్వాలని కోరుతున్నారు. పేదలకు ఉచిత పథకాలు ఉండాలని మరికొందరు వాదిస్తున్నారు. మీరేమంటారు?
News February 20, 2026
సంతోషీమాత వ్రతంలో పులుపు ఎందుకు నిషిద్ధం

సంతోషీ అమ్మవారు శాంతికి ప్రతీక. అయితే పులుపు, చేదు కోపాన్ని, ఆవేశాన్ని ప్రేరేపిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచడానికి వ్రతం రోజున వీటిని దూరం పెడతారు. వీటిని నివారిస్తే భక్తులలో పట్టుదల, నిగ్రహం పెరుగుతాయి. సహనం అలవాటు అవుతుంది. అత్యాశ తగ్గి ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందే గుణం అలవరుతుంది. అలాగే ఆలోచనలలో స్వచ్ఛత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా సాత్విక ప్రభావాన్ని చూపుతుంది.
News February 20, 2026
ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8


