News January 24, 2025

ఆందోల్: సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

image

సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దామోదర నరసింహ అన్నారు. ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నిరంతరం ప్రక్రియని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Similar News

News July 9, 2025

ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

image

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

News July 9, 2025

నాగార్జునసాగర్ నిండితే వారికి పండుగే..

image

నాగార్జున సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతుల ఎమోషన్. ఇది నిండిందంటే చాలు వారికి పండుగే. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌లో‌కి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు జోరందుకున్నాయి. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద 3.75 లక్షల ఎకరాలు ఉంది.

News July 9, 2025

సిగాచీ.. ఆ 8 మంది మృతిచెందారని అనుమానాలు

image

TG: సిగాచీ ప్రమాద ఘటనలో ఆచూకీ దొరకని 8 మంది మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించడం కష్టమేనని తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలి బూడిదై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఈ ఘటనలో అంతకుముందు 44 మంది మరణించారు.