News July 8, 2025
ఆంధ్రా TO భైంసా.. కిలో రూ.50

నిర్మల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో ప్రతికూల పరిస్థితుల మూలంగా టమాటా సాగు తగ్గిపోయింది. వంటింట్లో ఏది వండాలన్న అందులో ముఖ్యంగా టమాటా అవసరమే. దిగుబడులు లేకపోవడంతో వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి తీసుకొచ్చి భైంసాలో చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో కిలో టమాటా ధరలు పెరిగి కిలో రూ. 50 పలుకుతోంది.
Similar News
News July 8, 2025
ములుగు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా రేపు కళ్యాణి ప్రమాణ స్వీకారం

ములుగు మార్కెట్ యార్డు కమిటీ ఛైర్‌పర్సన్‌గా మహిళా కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి నియామకమైన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కళ్యాణి మొదట కామారం సర్పంచ్‌గా పని చేశారు. అనతి కాలంలోనే పార్టీ ఆమె సేవలను గుర్తించి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. తన సేవలను గుర్తించిన మంత్రి సీతక్కకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
News July 8, 2025
CBSE: సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను CBSE రిలీజ్ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ స్టూడెంట్స్ తమ స్కూళ్లలో హాల్ టికెట్లు కలెక్ట్ చేసుకోవాలని పేర్కొంది. కాగా ఈనెల 15 నుంచి 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. 10 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
News July 8, 2025
ధరూర్: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న జూరాల ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం ఇన్ ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 14 గేట్లు ఓపెన్ చేసి 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్ హౌస్‌కు 29,053, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400 క్యూసెక్కులు మొత్తం 1,26,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.