News December 9, 2025
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘Gen-Z’ పోస్టాఫీసు ప్రారంభం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాష్ట్రంలోనే తొలి ‘Gen-Z’ థీమ్డ్ పోస్టాఫీసును వీసీ ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్, పోస్ట్ మాస్టర్ జనరల్ జయశంకర్ మంగళవారం ప్రారంభించారు. విద్యార్థులు, పరిశోధకుల అవసరాలకు తగ్గట్టుగా డిజిటల్ కౌంటర్లు, వేగవంతమైన పార్శిల్ సేవలతో ఈ ఆధునిక పోస్టాఫీసును తీర్చిదిద్దారు. ఇది విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి, ప్రాజెక్టుల పనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీసీ పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 22 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ ఓపెన్ ఫోరమ్‌లో 22 వినతులను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు స్వీకరించారు. వీటిలో జోన్లు భీమిలి-1, మధురవాడ-3, ఈస్ట్-7, సౌత్-2, నార్త్-2, వెస్ట్-1, పెందుర్తి-2, గాజువాక-4 వినతులు ఉన్నాయి. సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 13, 2026
నగరంలో 291 మంది పోలీసులకు రివార్డులు

నగరంలోని గత నెలలో వివిధ కేసుల్లోని ప్రతిభ చూపించిన 291 పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబత్ర బాగ్చి రివార్డులు అందజేశారు. వివిధ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకు మెరిట్ ఆధారంగా గుర్తించి రివార్డులు క్రైమ్ మీటింగ్లో అందించారు. మిగతా సిబ్బంది వీరిని స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో మరింత పనిచేయాలన్నారు.
News February 13, 2026
విశాఖ: రేపు పాఠశాలల సెలవు రద్దు

జిల్లాలో ఫిబ్రవరి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నెలకొన్న ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో ఒక రోజు సెలవు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.


