News October 27, 2025
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రేపు సెలవు

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు తరగతుల రద్దు చేశారు. విద్యార్థులను హాస్టల్స్‌కు పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుఫాను తీవ్రత పెరగడం, వర్షం అధికమవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులకు సైతం రేపు సెలవు ప్రకటించారు.
Similar News
News October 27, 2025
రుషికొండ బీచ్‌లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్ ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అడిషనల్ ఎస్పీ మధుసూదన్ పరిశీలించారు. బీచ్ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాను.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది

మొంథా తుఫానుపై వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని DMHO జగదీశ్వరరావు అప్రమత్తం చేశారు. 54 హెల్త్ వెల్‌నెస్, 66 పట్టణ, 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంచినీటి వనరులను బ్లీచింగ్ చేయాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏడు 104, పదహారు 108, ఇరవై మూడు 102 తల్లి బిడ్డ వాహనాలను తుఫాను ప్రాంతాల్లో ఫిషెర్మెన్ డిపార్ట్మెంట్‌తో కలిసి బోట్ క్లీనిక్స్‌గా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
News October 27, 2025
విశాఖ: ‘29న టిఫన్, భోజనం ప్యాకెట్లను సిద్దం చేసుకోవాలి’

ఈనెల 28న గంటకు 150-200 KM వేగంతో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. తీరం దాటే ప్రభావంతో చాలా నష్టం వాటిల్ల వచ్చని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


