News September 1, 2025
ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్: VZM SP

ఆకతాయిల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు.
మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఐదు బృందాలుగా 30 మంది నిత్యం పహారా కాస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News September 3, 2025
9న రైతు నిరసన: చిన్న శ్రీను

రైతు సమస్యలపై రెవెన్యూ డివిజన్ల స్థాయిలో ఈనెల 9న రైతు నిరసన కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించ తలపెట్టినట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందని రైతులు చెబుతుంటే కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
News September 3, 2025
VZM: మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ పాఠశాలలో డ్రైవింగ్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. కనీసం ఏడాది కాలపరిమితి గల లైట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్‌తో ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News September 3, 2025
అపశృతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి: SP

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అపశృతులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డిజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.