News January 15, 2026
ఆకర్షణగా ‘I ❤️ MULUGU’

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘I ❤️ MULUGU’ సైన్‌బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సైన్‌బోర్డు పట్టణ అందాన్ని మరింత పెంచింది. స్థానికులు, సందర్శకులు ఇక్కడ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ములుగు పట్టణానికి గుర్తింపుగా ఇది మారుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 19, 2026
SRCL: ‘మహిళల ఆర్థిక ప్రగతితో దేశ రాష్ట్ర ప్రగతి సాధ్యం’

మహిళల ఆర్థిక ప్రగతితో దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వామ్యులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని, స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News January 19, 2026
రేపు ఆటోల బంద్.. క్లారిటీ

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
News January 19, 2026
సిరిసిల్ల: ‘మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలి’

మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,295 మహిళా సంఘాలకు (SHG) ₹4,64,68,771 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి సమాజంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని అన్నారు.


