News January 10, 2026

ఆకర్షణీయంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్: కలెక్టర్ రిజ్వాన్ బాషా

image

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జఫర్‌గఢ్ మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. MLA కడియం శ్రీహరి చొరవతోనే జిల్లాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు అత్యాధునిక వసతులు అందుతాయని, నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు.

Similar News

News January 11, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300-రూ.320గా ఉంది. విజయవాడలో రూ.300, గుంటూరులో రూ.290, నంద్యాల జిల్లాలో రూ.240-రూ.280, కామారెడ్డిలో రూ.300, వరంగల్‌లో రూ.300కి విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 11, 2026

ప.గో: పందెపు బరుల ఏర్పాటు.. బౌన్సర్లతో భద్రత!

image

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.

News January 11, 2026

వేములవాడ: ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి అదనపు ఛార్జీలు

image

సంక్రాంతి పండుగ పేరిట ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ సమయంలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వేములవాడకు డీలక్స్ బస్సు టికెట్ రూ.250 ఉండగా, పండుగ స్పెషల్ పేరిట నిర్వహిస్తున్న బస్సుల్లో రూ.350 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.