News February 9, 2026
ఆకాశంలో టాక్సీలు.. బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్: CII ప్రతిపాదన

గురుగ్రామ్, నోయిడా ఎయిర్‌పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్‌లను కలుపుతూ ఈ నెట్‌వర్క్ రాబోతోంది.
Similar News
News February 14, 2026
BRS విప్ ఇస్తే గైర్హాజరయ్యేలా ఆ MLAల ప్లాన్!

TG: ఎన్నికల్లో 30కి పైగా మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే MP, MLA, MLCలు కీలకంగా మారారు. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉంటున్న MLAల విషయంలో BRS తర్జనభర్జన పడుతోంది. విప్ జారీచేయాలని, దాన్ని ఉల్లంఘిస్తే కనుక అనర్హత కేసుకు బలం చేకూరుతుందని భావిస్తోంది. కాగా BRS విప్ ఇస్తే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం.
News February 14, 2026
చెన్నైలోని NITTTRలో ఉద్యోగాలు

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(NITTTR)12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in
News February 14, 2026
IND vs PAK: వర్షం అడ్డంకి లేదు.. ఫుల్ గేమ్ గ్యారంటీ?

రేపు కొలంబోలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణుల అంచనా. IND vs PAK మ్యాచ్ ప్రారంభమయ్యే టైమ్(7PM)కు స్కై క్లియర్‌గా ఉంటుందని అంటున్నారు. ఆట సమయంలో వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందన్నారు. అదే జరిగితే ఓవర్ల తగ్గింపు లేకుండా పూర్తి మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్నా రాత్రికల్లా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.


