News April 14, 2024

ఆకాశాన్నంటుతున్న నూజివీడు రసాల ధరలు

image

మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూజివీడులో చిన్నరసాల ధర (డజన్) రూ.300 నుంచి రూ.350 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నల్ల తామర వ్యాప్తితో ఈ ఏడాది మామిడి పూత చాలావరకు మాడిపోయింది. దీంతో దిగుబడి పడిపోయి.. ఊరగాయకు సైతం కాయలు దొరకని పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ధరలను చూస్తుంటే ఇక ఈ ఏడాది మామిడి పండ్లు తినడం ‘భారమే’నంటున్నారు.

Similar News

News September 10, 2025

కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మరో మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమై 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతుల ఊపిరిగా మారింది. ఆ తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలు మళ్లించిన ఈ పథకం డెల్టా రైతులకు ఆపద్బాంధవంగా నిలిచింది.

News September 10, 2025

చల్లపల్లిలో యూరియా పంపిణీ పరిశీలించిన కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం చల్లపల్లి మండలం లక్ష్మీపురం పీఏసీఎస్ వద్ద యూరియా విక్రయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరా, పొందిన రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణమోహన్, ఏఓ కే.మురళీకృష్ణ, సొసైటీ సీఈఓ రమేశ్, వీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News September 10, 2025

కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐగా పదోన్నతి లభించింది. 1989 బ్యాచ్‌కు చెందిన కేఏవీ ప్రసాదరావు, కె. గణేష్, కె. వెంకటేశ్వరరావులకు ఈ పదోన్నతి దక్కింది. వీరిని ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల, నిబద్ధత, విధేయత కారణంగానే ఈ పదోన్నతి సాధ్యమైందని ఎస్పీ అన్నారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.