News March 22, 2025

ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

image

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

Similar News

నిర్మల్: బీఆర్ఎస్ నేతల అరెస్ట్

image

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని పలు మండలాల బీఆర్ఎస్ నేతలను శనివారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీలను పూర్తిగా మాఫీ చేయలేదన్నారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ఇవ్వడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

News March 22, 2025

MBNR: నేటి నుంచి ఐపీఎల్ షురూ.. జర జాగ్రత్త గురూ!

image

ఐపీఎల్ అంటేనే ఏమా క్రేజ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ పై బెట్టింగ్ పెడుతూ యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతేడాది పలువురు బెట్టింగ్ రాయుళ్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ పై మోజు పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.బెట్టింగ్ అని వచ్చే వారితో యువత జాగ్రత్తగా ఉండాలని, సమాచారం ఇవ్వాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!