News March 13, 2025

ఆక్రమణలకు గుర్తింపు పొందేందుకు ఉత్వర్వులు: కలెక్టర్

image

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ది 15.10.2019 లోపు ఇళ్లు నిర్మించుకొని ఉన్న ఆక్రమణలకు గుర్తింపు పొందుటకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అర్హత గల ఆక్రమణదారులు వారి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. 31 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News December 18, 2025

VJA: చిన్నారుల విక్రయ ముఠా అరెస్టుతో విస్తుపోయే నిజాలు..!

image

విజయవాడలో <<18602510>>చిన్నారుల విక్రయ ముఠాను<<>> పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ నుంచి నెలల వయసున్న శిశువులను తీసుకువచ్చి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురిని ఐసీడీఎస్‌ కేంద్రానికి తరలించారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు DCP సరిత తెలిపారు.

News December 18, 2025

KNR: ఎన్నికల పరిశీలకులకు అభినందనలు: కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎన్నికల పరిశీలకులు వి. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఎన్నికల విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసిన తీరు ప్రశంసనీయం అన్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి ఫలితమే విజయవంతమైన ఎన్నికల నిర్వహణ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారు.

News December 18, 2025

రేపు విజయనగరం రానున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, సాయంత్రం 4.45 గంటలకు వీటీ.అగ్రహారం వై-జంక్షన్ సమీపంలోని CMR లేఅవుట్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విశాఖ బయలుదేరి వెళ్తారు.