News April 20, 2024
ఆక్రమ రవాణాపై ఉక్కు పాదం జిల్లా ఎస్పీ ఆరీఫ్

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం జిల్లాలో సైదాపురం పరిధిలో-20, KP పోర్ట్-9, కొండాపురం-15, సంగం-11, దుత్తలూరు-7, జలదంకి-25, చేజెర్ల-10 మరియు SEB-217 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సి-విజిల్ యాప్ , టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Similar News
News October 10, 2025
నెల్లూరు: అద్దె బకాయిలు దారి మల్లించారా?

నెల్లూరు చిన్నబజారులోని NMC కి చెందిన పలు షాపులు వారు అద్దెలు చెల్లించలేదు. దీంతో గురువారం NMC రెవెన్యూ అధికారి సమద్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేశారు. వీటిల్లో 2 షాప్‌కు రూ.1 లక్ష, 11 నెంబర్ షాప్‌కు రూ. 6.57లక్షలు, 22 షాప్‌కు రూ. 72 వేలు , 30 షాప్‌కు రూ. 15 లక్షలు చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంది. అద్దెలు చెల్లించకుండా ఉండడం వెనుక కార్యాలయంలోని పలువురు చక్రం తిప్పినట్లు విమర్శలొస్తున్నాయి.
News October 10, 2025
యువతకు పొగాకు మత్తు వదిలేనా.!

జిల్లాలో యువత మత్తు పదార్థాల వాడకం ఎక్కువ అయినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా గంజాయి జాడ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖ “TOBACO FREE YOUTH CAMPAIGN 3.0” పేరిట ఈ నెల 9 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. పొగాకు వాడకంతో 2024-25 ఏడాదిలో నోటి క్యాన్సర్లు 225, సీవోపీడీ కేసులు 469 చొప్పున నమోదయ్యాయి. మరి అధికారులు చేపట్టిన చర్యలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.
News October 10, 2025
CM పర్యటనకు 1250 మందితో బందోబస్త్: SP

1,250 మంది పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు ఎస్పీ అజిత తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా, పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.