News September 23, 2025
ఆక్వా చెరువులకు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు అందరూ APSADA Act – 2020 ప్రకారం తమ చేపల చెరువులను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు లైసెన్సులు పొందాలని ఆమె స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశించారు.
Similar News
News September 23, 2025
కడియం: అమ్మవారికి 95 కిలోల లడ్డూ

కడియం శ్రీదేవి చౌక్ సెంటర్‌లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అదే గ్రామానికి చెందిన ఎన్.నానాజీ అమ్మవారికి లడ్డూ సమర్పించారు. 95 కిలోల భారీ లడ్డూను మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ లడ్డూను 10 రోజులపాటు అమ్మవారి వద్ద ఉంచుతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
News September 23, 2025
రాజమండ్రి: నేరాల కట్టడికి డ్రోన్‌తో నిఘా

జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, గంజాయి వినియోగం వంటి నేరాలను కట్టడి చేయడానికి జిల్లావ్యాప్తంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఈ ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సోమవారం పోలీసులు తెలిపారు.
News September 22, 2025
రాజమండ్రి: హ్యాండ్‌కఫ్స్‌తో ఖైదీ పరార్

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకెళ్లి తిరిగి తీసుకువస్తున్న సమయంలో బత్తుల ప్రభాకర్ అనే ఖైదీ తప్పించుకున్నట్లు పోలీసుల తెలిపారు. సోమవారం రాత్రి దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో వాహనం ఆపగా అతడు పరారయ్యాడని పేర్కొన్నారు. తప్పించుకునే సమయంలో నిందితుడి చేతులకు హ్యాండ్‌కఫ్స్ ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసినవారు 94407 96584 నంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ నాయక్ కోరారు.