News January 27, 2025
ఆక్వా చెరువుల వివరాలను సమర్పించాలి: కలెక్టర్

సముద్ర తీర ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంత విస్తీర్ణంలో బ్యాకీస్ వాటర్ ప్రెస్ వాటర్ ఆక్వా చెరువుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. జియో కో-ఆర్డినేటర్స్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితత్వంతో కూడిన వివరాలను సమర్పించాలన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో మత్స్య అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించారు. ఆక్వా చెరువుల అనుమతులపై సమీక్షించారు.
Similar News
News September 18, 2025
2027 గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ఏర్పాట్లు ప్రారంభం

2027లో మొదలయ్యే గోదావరి పుష్కరాల కోసం ధర్మపురిలో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మాస్టర్ ప్లాన్, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు, రోడ్లు, పార్కింగ్, నీరు, వైద్య సేవలపై సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
News September 18, 2025
మంచిర్యాల: 19న పలు రైళ్ల రద్దు

మందమర్రి-రామగుండం మధ్య 24 కి.మీ ట్రిపుల్ లైన్ రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనులు చేపట్టడంతో ఈనెల 19న పలు రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రామగిరి ఎక్స్‌ప్రెస్, కాజీపేట-బల్లార్షా ఎక్స్‌ప్రెస్ పూర్తిగా రద్దు కాగా, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-కాజీపేట వరకు, సింగరేణి ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ వరకు నడుస్తాయని తెలిపారు.
News September 18, 2025
పత్తి కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్

2025-26 పత్తి కొనుగోలు సీజన్‌పై సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్షించారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు జరపాలన్నారు. జిన్నింగ్ మిల్లుల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా, రైతులకు లాభదాయకంగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.