News October 18, 2025
ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఆక్వా కల్చర్ సాగు చేసేవారు కచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధి చేయుటకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలు వేసినట్లు తెలిపారు. లైసెన్సుల కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 19, 2025
గంగాధర, ధర్మపురికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల స్థాపనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కళాశాల విద్య కమిషనర్ నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని కళాశాల విద్య కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
News October 19, 2025
GNT: ‘గేట్’ కమిటీ సభ్యులు మన కొత్త కోటేశ్వరరావు

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబర్ 19-2021 నవంబర్ 29) తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడిలో జన్మించారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి డాక్టరల్ డిగ్రీని కూడా పొందారు. వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన పనిచేశారు.
News October 19, 2025
ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.