News January 29, 2026
ఆక్వా సాగు రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆక్వా సాగు రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 1.31 లక్షల ఎకరాల ఆక్వా విస్తీర్ణంలో ఇప్పటివరకు 66,340 ఎకరాల నమోదు పూర్తయిందని తెలిపారు. మిగిలిన 39,413 ఎకరాల అప్సడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News February 21, 2026
టెన్త్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: DEO

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ పిలుపునిచ్చారు. శనివారం పోడూరులోని క్లస్టర్ కాంప్లెక్స్‌లను ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సూర్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News February 21, 2026
కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
News February 21, 2026
నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.


