News August 9, 2025
ఆగస్టు 12న ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ, టేకులపల్లి)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఈ ఉద్యోగాలకు బీటెక్ బయో మెడికల్ అర్హత కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News August 9, 2025
పలు విభాగాల పనితీరుపై కలెక్టర్ సీరియస్

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పలు విభాగాల్లో పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో 259 మంది కార్మికులు ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో సగం మందే పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్ట్ గడువు ఈ నెలతో ముగుస్తున్నందున 50 మందికి ఒక సూపర్వైజర్ చొప్పున బాధ్యతలు అప్పగించి పనులు చేయించాలని సూచించారు.
News August 8, 2025
ఖమ్మం జిల్లాలో 418.4 మి.మీ వర్షాపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో గడచిన 24 గంటల్లో మొత్తం 418.4 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. వేంసూర్ మండలంలో అత్యధికంగా 74.4 మి.మీ, ఎర్రుపాలెం 52.2, నేలకొండపల్లి 50.2, బోనకల్ 47.8, మధిర 42.2 వర్షాపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో తక్కువ వర్షపాతం రికార్డు కాగా జిల్లాలో సగటు వర్షపాతం 19.9 మి.మీగా నమోదైందని, రెండు రోజులు పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
News August 8, 2025
ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 75,000 భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 49,000 సాదా బైనామా దరఖాస్తులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, ర్యాండమ్ చెకింగ్ ద్వారా తప్పులు నివారించాలని సూచించారు. సెలవులు లేకుండా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు.