News August 5, 2025
ఆగస్టు 12న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం: కలెక్టర్

జిల్లాలో ఆగస్టు 12న నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె గోడపత్రికను ఆవిష్కరించారు. 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా అల్బెండజోల్ మాత్రలు అందిస్తామన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం వంటి సమస్యలు వస్తాయని ఆమె వివరించారు.
Similar News
News August 5, 2025
ఆగస్టు15 వేడుకలు దేశభక్తిని ప్రతిబింబించేలా ఉండాలి: కలెక్టర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, దేశభక్తి ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాల ప్రదర్శన ఉండాలని ఆమె సూచించారు. వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
News August 4, 2025

రాజమండ్రి: అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కింద తొలి విడతలో నిధులు జమకాని రైతుల వివరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ నిధులు అందేలా చూడాలని సూచించారు.