News February 23, 2026
ఆగిరిపల్లి: 12 ఏళ్ల తర్వాత చిక్కిన హత్య కేసు ముద్దాయి!

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2009లో జరిగిన హత్య కేసులో A3గా ఉన్న అలవాల బాబ్జి, 2014 నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నాడు. నిందితుడిని గుంటూరు జిల్లా దాసరిపాలెంలో అదుపులోకి తీసుకుని, సోమవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు.
Similar News
News February 26, 2026
బాపట్ల: 40 బైకులు, 4 లీటర్ల నాటుసారా స్వాధీనం- ఎస్పీ

జిల్లాలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించి 40 బైకులు, 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.
News February 26, 2026
డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ‘అతివేగం, డ్రంకెన్ డ్రైవ్ వంటి కారణాలతో ఏటా 1.8L మంది చనిపోతున్నారు. అందుకే త్వరలో కొత్త విధానం తెస్తాం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ల కోత పడుతుంది. అన్ని పాయింట్లు కోల్పోతే లైసెన్స్‌ను 6నెలలు సస్పెండ్ చేస్తాం. రిపీట్ చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం’ అని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు.
News February 26, 2026
మాస్టర్ ప్లాన్ 2050.. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ముసుగులో భూదందా!

HMDA సిద్ధం చేస్తున్న ‘విజన్ 2050’ మాస్టర్ ప్లాన్ ఇంకా నోటిఫై కాకముందే దానిలోని ‘గ్రీన్ జోన్’, ‘రెసిడెన్షియల్ జోన్’ వివరాలు లీక్ అయ్యాయి. ఏయే ప్రాంతాలు భవిష్యత్తులో పారిశ్రామిక హబ్‌లుగా మారుతాయో ముందే తెలుసుకున్న కొందరు అధికారులు, రాజకీయ నేతలు కలిసి చుట్టుపక్కల వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేశారు. ఈ ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ విలువ దాదాపు ₹5,000 కోట్లకు పైమాటే.


