News February 3, 2025
ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ
వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.
Similar News
News February 3, 2025
కాకినాడ: క్రీడా పోటీలు ప్రారంభం
గోదావరి టెన్నిస్ అసోసియేషన్, కాకినాడ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఛాంపియన్ షిప్ సిరీస్ – AITA అండర్ 16 పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పోటీలకు కావలసిన సహాయ సహకారాలు ఆయన అందిస్తానన్నారు.
News February 3, 2025
తూ.గో: సోలార్ విద్యుత్ యూనిట్స్ స్థాపనకు కృషి చేయాలి- కలెక్టర్
సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్స్ స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ ట్రాన్స్కో క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్స్ ఏర్పాటు చేయడం పై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
News February 3, 2025
నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.