News March 7, 2025
ఆటల పోటీల్లో విజేతగా అనకాపల్లి కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆటల పోటీల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, రెవెన్యూ శాఖకు చెందిన మహిళ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డిస్కస్ త్రో, స్పీడ్ వాకింగ్ పోటీల్లో కలెక్టర్ విన్నర్‌గా నిలిచారు.
Similar News
News September 15, 2025
ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమర్పించిన వినతులను వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. నేటి ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 72, జీడబ్ల్యూ ఎంసీ 20, గృహ నిర్మాణ శాఖ 11, విద్యా శాఖ 9, డీఆర్డీవో 7, ఇతర శాఖలకు సంబంధించిన 47 ఫిర్యాదులు వచ్చాయి.
News September 15, 2025
నిజాంసాగర్: 5 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 33,910 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ సోమవారం రాత్రి తెలిపారు. ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 17.397 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
News September 15, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 115 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 115 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.