News April 11, 2026
ఆటిజం పిల్లల వికాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఆటిజమ్‌తో బాధపడే పిల్లలకు విద్య, వైద్యంతో పాటు జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న సమగ్ర ఆటిజమ్ సపోర్ట్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. పిల్లల మేధాశక్తి పెంపు కోసం సరైన వాతావరణం, పరికరాలు ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని తెలిపారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 15, 2026
BSNLలో 120 పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/ CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు రేపటి నుంచి 23వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.
News April 15, 2026
నేడు అమరావతికి సీఎం.. షెడ్యూల్ ఇదే..!

పల్నాడు(D) అమరావతిలో CM చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ధరణికోటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకుంటారు. 2:15కు అన్న క్యాంటీన్ ప్రారంభించి లబ్ధిదారులతో CM భోజనం చేయనున్నారు. తిరిగి 2:45 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
News April 15, 2026
రజినీ 173వ మూవీ.. మళ్లీ డైరెక్టర్ మార్పు?

రజినీకాంత్ 173వ చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కమల్ హాసన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తొలుత సి.సుందర్‌ను డైరెక్టర్‌గా ఎంపిక చేయగా ఆయన తప్పుకున్నారు. తర్వాత శిబి చక్రవర్తి చేతికి ఆ ప్రాజెక్టు వెళ్లింది. ఇప్పుడు ఆయన స్థానంలో యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరపైకి వచ్చారు. త్వరలోనే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఓరి దేవుడా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో అశ్వత్ తెలుగులోనూ సుపరిచితమే.


