News December 28, 2024
ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలి: GNT ఎస్పీ
ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ కల్యాణ మండపంలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు. ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
Similar News
News December 29, 2024
పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి
పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 29, 2024
2024లో ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్
@అమరావతిని తిరిగి రాజధానిగా అభివృద్ధి చేయడం @ఎలక్షన్ సమయంలో నరసరావుపేట, మాచర్ల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు @గుంటూరు నుంచి ఎంపీ పెమ్మసాని కేంద్రమంత్రిగా ఎంపిక @వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ దారుణ హత్య @అక్టోబర్లో కృష్ణానది ఉగ్రరూపం, బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసం @ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి హత్య చేయడం @ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్లు, వరదల నేపథ్యంలో తీవ్ర పంట నష్టం.
News December 29, 2024
గుంటూరు: విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్
10th విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఇమ్మానియేల్ పేటకు చెందిన అజయ్ కుమార్ చదువు మానేసి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. కడుపు నొప్పి రావడంతో బాలికను ఆసుపత్రికి తరలించే లోపు ఇంట్లోనే ప్రసవించిందన్నారు.