News April 21, 2025
ఆటోనగర్ లాడ్జీల్లో తనిఖీలు

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.
Similar News
News April 21, 2025
IPL.. CSKకు ఇంకా అవకాశం ఉందా?

IPLలో మేటి జట్లను చిత్తు చేసిన CSK ఈసారి వరుస పరాజయాలు చవిచూస్తోంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఇప్పటికీ CSK ప్లేఆఫ్స్‌కి వెళ్లొచ్చు. ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 నెగ్గి 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు.. మిగతా 6 మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించాలి. నెట్ రన్‌రేట్ కూడా పెంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి CSK ప్లేఆఫ్స్‌కు వెళ్తుందని మీరు భావిస్తున్నారా?
News April 21, 2025
‘శాలరీ’ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతోంది!

భారత్‌లో దశాబ్దాలుగా మధ్య తరగతివారికి ఆర్థికంగా అండగా నిలిచిన శాలరీ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త సౌరభ్ ముఖర్జియా అభిప్రాయపడ్డారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘ఇండియా నూతన ఆర్థిక యుగంలోకి ప్రవేశిస్తోంది. జీతం కోసం కాకుండా ప్రయోజనాల కోసం పనిచేసే రోజులు రానున్నాయి. చదువు ఒక్కటే సరిపోదు. వందలాది మంది చేసే పనిని AI క్షణాల్లో చేసేస్తోంది. ఎవరికీ గ్యారంటీ లేదు’ అని వివరించారు.
News April 21, 2025
గద్వాల: చట్టంలో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారు..?: సరిత

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ముస్లిం నేతలు నిర్వహించిన భారీ ర్యాలీకి ఆమె మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టంలో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.