News April 15, 2024

ఆటోలోంచి తల బయటకుపెట్టిన మహిళ.. మృతి

image

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో విషాదం నెలకొంది. దిబ్బలపాలెంకు చెందిన లోవదుర్గ ఈ రోజు తెల్లవారుజామున వాడపల్లి వెంకన్నబాబు దర్శనం నిమిత్తం అదే వీధికి చెందిన మరో ఇద్దరు మహిళలతో కలిసి ఆటోలో బయలుదేరింది. ఎర్రవరం హైవేపై గల వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ వద్దకు ఆ ఆటో వెళ్లగా.. లోవదుర్గకు వాంతులు రావడంతో తల బయటకు పెట్టింది. ఆ సమయంలో వాహనం ఆమె తలను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించింది.

Similar News

News October 7, 2025

‘అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలి’

image

జిల్లాలో నేరాల అదుపునకు అనుమానిత ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించాలని SP నరసింహ కిషోర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర గణాంకాలపై సమీక్షించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, పెండింగ్ NBWS, NDPS కేసుల దర్యాప్తుపై సమీక్షించారు.

News October 7, 2025

రాజమండ్రిలో వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా

image

ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. మంగళవారం ఆమె రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరిక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.

News October 7, 2025

ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకతకు కృషి: జేసీ

image

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నాయని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 871 చౌకధరల దుకాణాలు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. రేషన్ కార్డుదారులకు 93% నుంచి 94% వరకు నిత్యావసర వస్తువులు సమయానికి సరఫరా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.