News March 4, 2025
ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.
Similar News
News March 4, 2025
రోహిత్ ఈ సారైనా టాస్ గెలువు: ఆకాశ్ చోప్రా

రోహిత్‌శర్మ ఈసారైనా టాస్ గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోరారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ పాత్ర కీలకం కానుందని తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. ఈ పిచ్‌లపై ఛేజింగ్ చాలా కష్టమని, సెమీస్‌లో టాస్ గెలవటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడినప్పటికీ మ్యాచులలో గెలిచింది. అయితే రోహిత్ శర్మ వరుసగా 10సార్లు టాస్ ఓడి రికార్డు సృష్టించారు.
News March 4, 2025
దిశvsశక్తి.. మండలిలో వాడీవేడీ చర్చ

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను తొలగించడంపై మండలిలో YCP MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు సవిత, అనిత కౌంటరిచ్చారు. చట్టబద్ధత లేని దిశ గురించి ఆమె మాట్లాడుతున్నారని, ఆ యాప్‌తో ఎంతమంది మహిళలను రక్షించారని ప్రశ్నించారు. తాము నెట్‌వర్క్ లేని చోట కూడా పనిచేసేలా శక్తి యాప్‌ను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తామని తెలిపారు.
News March 4, 2025
ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.