News March 9, 2025

ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

image

గుమ్మగట్ట మండలం గోనబావి క్రాస్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీకాంత్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆటోలో పనిమీద రాయదుర్గం వెళ్తుండగా మార్గమధ్యలో బోల్తా పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 9, 2025

అనంత జిల్లాలో 746 కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News August 7, 2025

స్పెషల్ డ్రైవ్.. 146 కేసులు నమోదు

image

డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో తనిఖీలు నిర్వహించి 53 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 93 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు జిల్లాలో డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.

News August 7, 2025

నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని మహిళ సూసైడ్

image

గుంతకల్లు సోఫియా వీధికి చెందిన షమీం భాను(35) తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని, బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భాను మొదటి భర్తకు విడాకులు ఇచ్చి గుంతకల్లు సచివాలయ వీఆర్ఓ మహమ్మద్ వలిని గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం తరలిస్తుండగా మృతిచెందింది.