News January 7, 2026

ఆడపిల్లలను ఇలా పెంచాలి

image

ఈ రోజుల్లో పిల్లల పెంపకం చాలా సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఆడపిల్లలను భయపడకుండా, ధైర్యంగా నిలబడుతూ, తమను తాము ఎలా రక్షించుకోవాలో కచ్చితంగా నేర్పించాలంటున్నారు నిపుణులు. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దృఢ సంకల్పంతో ఎలా ఎదుర్కోవాలో అమ్మాయిలకు నేర్పాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రోత్సహించాలి. వారు మంచి పనులు చేస్తే పొగడటం, కొత్త పనిని ప్రయత్నిస్తుంటే ప్రోత్సహించడం ముఖ్యమంటున్నారు.

Similar News

News February 9, 2026

అంధత్వాన్ని జయించి.. కేరళలో తొలి జడ్జిగా

image

‘సంకల్పం ముందు వైకల్యం ఎంత?’ అని నిరూపించారు కేరళకు చెందిన సి.తాన్యా నాథన్. అంధురాలైన తాన్యా కేరళలో తొలి అంధ మహిళా జడ్జిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల జరిగిన జుడీషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులూ న్యాయ వ్యవస్థలో విధుల నిర్వహణకు అర్హులని గతేడాది SC ఇచ్చిన తీర్పు ఆమె కలను నిజం చేసింది. బ్రెయిలీ లిపిలో ఆమె లా చదువుకున్నారు.

News February 9, 2026

ఎంత పడుకున్నా అలసట తీరట్లేదా?

image

రాత్రిళ్లు హాయిగా పడుకున్నా ఉదయం నిద్ర మత్తుగా ఉండటానికి విటమిన్ డీ లోపమే కారణమంటున్నారు నిపుణులు. ఇది మూడ్, శక్తిని నియంత్రించే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. మధ్యాహ్నం సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి సహజంగా తగ్గుతుంది. ఇలాంటప్పుడు విటమిన్ D లోపం ఉంటే నీరసం, నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి విటమిన్ D సప్లిమెంట్స్, సమతుల్య ఆహారం తీసుకోవాలి.

News February 9, 2026

‘నో ఫోన్ ఛాలెంజ్’.. మీ పిల్లలకూ విసరండి!

image

విద్యార్థులు ఫోన్లకు బానిసలవకుండా కేరళలోని కూతుపరంబ స్కూల్ టీచర్ అమృత ‘నో ఫోన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని పిల్లలకు స్టిక్కర్లు, ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది పిల్లల్లో సానుకూల పోటీని పెంచింది. మీరూ ఇంట్లో పిల్లలు ఫోన్ చూడకుండా ఉండేందుకు ఈ ఛాలెంజ్‌ను ట్రై చేయండి. రోజంతా ఫోన్ చూడకుంటే బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ సమయాన్ని క్రియేటివ్ వర్క్స్‌పై ఉపయోగించేలా చూడండి.