News January 24, 2025
ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం: ఇలా త్రిపాఠి
ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద నుంచి విద్యార్దినులు, మహిళలుతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా బేటి బచావో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్‌ను విడుదల చేశారు.
Similar News
News January 25, 2025
NLG: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల ఆహ్వానం
2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సహాయం కొరకు వివిధ రకాల దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల వయవృద్ధుల సంక్షేమ శాఖ నల్లగొండ జిల్లా అధికారి కెవి కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు tsobmms.cgg.gov.in నందు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News January 25, 2025
హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
గ్రామీణ, గిరిజన, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల విడిది కోసం హోమ్ స్టే నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం .శివాజీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ధర్తి ఆబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ అనే పథకంలో భాగంగా పర్యాటక, గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు ఇంటిలోనే తాత్కాలిక నివాస యోగ్యం కల్పించే హోమ్ స్టే కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
News January 24, 2025
నల్గొండ జిల్లాలో గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
నల్గొండ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 9:30 గంటలకు బాల బాలికల సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శకటాల ప్రదర్శన జరుగుతుందని అధికారులు తెలిపారు.