News August 30, 2025
ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు: MP

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. భీమారంలో ఓ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దృఢమైన సంకల్పం, అంకితభావంతో కష్టపడి పనిచేయాలన్నారు. ఆడపిల్లలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు.
Similar News
News August 31, 2025
కరీంనగర్: స్థానిక పోరు ప్రచారానికి సమయం లేదు మిత్రమా..!

స్థానిక సంస్థల ఎన్నికలకు TG కేబినెట్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్సు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి, SEP మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, నెలాఖరులోపు ఎన్నికల పూర్తికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆశావాహుల ఎన్నికల ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఇలా ఐతే ఖర్చు తగ్గుతుందని అభ్యర్థుల ఆశాభావం. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
News August 31, 2025
KNR: వచ్చే నెలలోనే స్థానిక పోరు.. అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం

స్థానిక ఎన్నికలను SEP 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించగా, సర్కారు వచ్చే నెలలో పూర్తి చేసేందుకు సిద్ధం చేసింది. రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేసి, 42% రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ తీర్మానించి ఎన్నికల నిర్వహణకు ECకి లేఖను కూడా పంపింది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు, ఓటర్ లిస్ట్ ఇలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.
News August 31, 2025
బీర్పూర్: కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. చికిత్స పొందుతూ మృతి

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఇంద్రాల రక్షిత్ అనే 3డు సంవత్సరాల బాలుడిని ఇటీవల కుక్కలు దాడి చేయడంతో గాయాల పాలయ్యాడు. బాలుడిని మొదట జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. మళ్లీ అక్కడి నుంచి సిద్దిపేటకు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు శనివారం ఉదయం మరణించాడు. బాలుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ