News January 24, 2025

ఆడపిల్లలు భారం కాదు.. భవితకు సోపానం: కలెక్టర్

image

ఆడపిల్లలు భారం కాదని.. భవితకు సోపానమని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం, అలాగే బేటీ బచావో – బేటీ పడావో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించారు.

Similar News

News September 14, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ

image

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌‌తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.

News September 14, 2025

ALERT: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

image

TG: హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెస్ట్ జోన్ DCP విజయ్‌కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చెత్త వేసే వారిని చట్టప్రకారం నేరస్థులుగా పరిగణిస్తూ 8 రోజుల వరకు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలో బోరబండ PS పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

News September 14, 2025

జిల్లా కలెక్టర్‌గా తవణంపల్లి వాసి

image

తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో స్వగ్రామంలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో వారి తల్లితండ్రులు మునెమ్మ, దొరస్వామి రెడ్డి పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు.